కులము కులమని కాటులడుతూ

కులము కులమని కాటులడుతూ
పరువు పరువనీ ప్రాకులాడుతూ
ధనము ధనమనీ ధ్యానము చేసి
మానవత్వపు మానము తీసి వాటి వీటిని కూడబెడుతావు
వేటినేన్నని తీసుకేలుతావు
 
కన్నె పిల్లకై గుడికి వెళ్తావు  
టైముపాసు కై బడికి వెళ్తావు
విద్య విడిచేసి బీటు కొడుతావు
పిల్ల పిల్లకు సైటు కొడుత్తవు
 
ప్రేమ ప్రేమని పిల్లకు చెప్పి
పెళ్లి కాకనే తల్లిని చేసి  
తాళి కట్టమంటె చెల్లిని చేసి
సంప్రదాయపు తలను తీస్తావు
 
ఇంటివాళ్ళు నీకు భార్యను తెస్తే
భార్య లక్షలుగా కట్నము తెస్తే
తల్లి తండ్రులను తన్ని తరిమేసి
ఒళ్ళు కుల్లెల త్రాగి చస్తావు
 
త్రాగడానికై అప్పులు చేసి
కుప్ప కుప్పలుగా తప్పులు చేసి
వింత వింతైన రోగాములోచ్చి
మందులేకుండా మరిగి చస్తావు
 
అందుకే మానవుడా
మంచినే నమ్మవయ్య
మంచినే చెయ్యవయ్య
మనిషిలా బ్రతకవయ్య